What is Dysphagia?
డిస్ఫేజియా అంటే ఏమిటి?
స్ట్రోక్ వచ్చిన వారిలో ఈ డిస్ఫేజియా లేదా ఆహారం మ్రింగలేక పోవడం సాదారణంగా కనబడుతుంది. ఇది ముఖ్యంగా నోటిలో స్పర్శ తగ్గుట వలన, మరియు నోటిలోని కండరాలు మరియు గొంతులోని కండరాలలో సమన్వయము లేకపోవడం వలన వస్తుంది. దీనివలన మనం తిన్న ఆహారము లేదా ద్రవ పదార్దములు శ్వాసకోశములోనుండి ఊపిరితిత్తులలోనికి వెళ్ళవచ్చు. దీనినే ఆస్పిరేషన్ అని అంటారు. ఇది ఊపిరితిత్తులని బాగా దెబ్బతీస్తుంది. దీనికి సరైన వైద్యము చేయించనట్లైతే న్యుమోనియాకి దారి తీస్తుంది. వయసు పైబడిన వారిలో, ఈ న్యుమోనియా ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ డిస్ఫేజియా వలన పోషకాహారలోపం, నిర్జలీకరణము, మరియు బరువు తగ్గుట వంటివి కనబడవచ్చు.

