లైంగికత మరియు స్ట్రోక్ (Sexuality and Stroke)
స్ట్రోక్ మరియు / లేదా అఫాసియా వచ్చినవారి పునరావాసంలో సెక్స్ మరియు గర్భ సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా, స్ట్రోక్ రావడానికి ముందు లైంగికంగా చురుకుగా ఉన్న వ్యక్తులు స్ట్రోక్ తర్వాత కూడా అదేవిధమైన సంబంధాలు కలిగి ఉండటానికి ఆసక్తి చూపుతారు. అయినప్పటికీ, పక్షవాతం వచ్చినపుడు మరియు ఇంద్రియ జ్ఞానం కోల్పోయినపుడు, శారీరక భాగస్వామ్యానికి సర్దుబాట్లు మరియు సహనం అవసరం అవుతాయి. స్ట్రోక్-తరువాతి కాలంలో వ్యక్తులు శారీరకంగా సాన్నిహిత్యంగా ఉండటానికి తాత్కాలికంగా ఆసక్తిని కనబరచరు. అది వారిలో అంతర్లీనంగా ఉన్న నిరాశ, ఔషధాల దుష్ప్రభావాలు, వక్రీకరించిన స్వీయ-ప్రతిష్ఠకు సంబంధించిన ఆందోళన మరియు శారీరక పరిమితి కారణంగా కలుగుతుంది.
పిల్లలు పుట్టే వయస్సున్న మహిళకు స్ట్రోక్ వస్తే, అది ఆమెకు పిల్లలు పుట్టే సామర్థ్యంపై ప్రభావితం చూపే అవకాశం లేదు. ఏదేమైనా, గర్భతికి కావలసిన అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి, పిల్లలు కనాలని ప్రణాళిక సిద్ధంచేసుకునే ముందుగా శిశువుకు సంరక్షణ అందించాలి. గర్భం రావడం వల్ల వచ్చే శారీరక ప్రభావాలను మరియు కలిగే నష్టాలను మీ వైద్యుడితో చర్చించండి. కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న మహిళలు గర్భం దాల్చడం కూడా స్ట్రోక్‌కు (ఎక్కువగా రక్తస్రావం) కారణం కావచ్చు. కాబట్టి చర్చిండం చాలా ముఖ్యం.
గర్భవతిగా ఉన్నపుడు స్ట్రోక్ వస్తే, అది తల్లికి మరియు పుట్టబోయేబిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో, వెంటనే ఆసుపత్రిలో వైద్య సహాయం తీసుకునేలా కుటుంబంలోని వారు చూడాలి, ఇందులో నాడీ చికిత్స మరియు నవజాత శిశు జాగ్రత్తలు (నియోనాటల్ కేర్) ఉంటాయి

