SUGGESTIONS FOR SAFETY IN THE HOUSE
ఇంట్లో రోగి సురక్షితంగా ఉండుటకు కొన్ని సూచనలు
ఇంట్లో రోగి యొక్క భద్రతను మెరుగుపరచడానికి మరియు స్వీయ రక్షణలో వారు పాల్గోనుటలో ప్రోత్సాహించడానికి ఈ క్రింది సూచనలు ఇవ్వబడినవి.
Patient's Welfare
రోగి యొక్క సంక్షేమం:
- రోగి తన అవసరాలను తెలియ చేయుటకు ఒక గంటను ఏర్పాటు చేయండి.
- ముఖ్యమైన మరియు అత్యవసర ఫోన్ నెంబర్లను సమీపములో ఉంచవలెను.
- రోగి ఒంటరిగా నివసిస్తుంటే కనీసం రోజుకి ఒకసారైనా సందర్శించుటకు లేదా కాల్ చేయుటకు ఏర్పాటు చేయండి.
Home Environment
ఇంటి వాతావరణం:
- ఇంట్లో రోగి నడిచే ప్రదేశాలలో సపోర్ట్ కొరకు హ్యాండ్ రైల్స్ ని లేదా మరేదైనా ఏర్పాట్లు చేయండి.
- రోగి ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేందుకు తివాచీలు, మరియు ఫర్నిచర్లును తొలగించండి.
- ఇంట్లో తిరిగేందుకు రబ్బరు చెప్పులను లేదా బూట్లను ఏర్పాటు చేయండి. వీటి వలన రోగి జారి పడకుండా నడవగలడు.
Kitchen Environment
వంట గది వాతావరణము:
- రోగి తనకు కావాల్సిన పదార్ధములను తీసుకొనుటకు వీలుగా కొంచెం ఎత్తులో పెట్టండి.
- వంట పాత్రలకు కొంచెం పెద్ద హ్యాండిల్స్ ఉంచవలెను. అన్నము కింద పడిపోకుండా చుట్టూ ఎత్తుగా ఉండే ప్లేటులో వడ్డించాలి.
- సింక్ వద్ద ట్యాప్లు కొంచెం పెద్దవిగా (మణికట్టుతో ఆన్/ఆఫ్ చేయుటకు వీలుగా) ఉండవలెను.
Bathroom Environment
బాత్రూమ్ వాతావరణం:
- రోగి లోపల నుండి గడి పెట్టకుండా చూడవలెను.
- బాత్రూమ్ లో రబ్బరుతో చేసిన తివాచిని ఉంచవలెను. ఇది ప్రమాదవ శాత్తు జారిపడిపోకుండా ఆపుతుంది.
- సబ్బును ఏదైనా తాడుతో ట్యాప్ / పంపుకి కట్టాలి. దీని వలన స్నానము చేసినప్పుడు సబ్బు కింద పడకుండా ఉంటుంది.
- కూర్చొనుటకు వీలుగా గట్టి బల్లను ఏర్పాటు చేయండి.
- బాత్రూమ్ లో షవర్ ని ఏర్పాటు చేయండి. ఇది రోగి నిలబడి స్నానము చేయుటకు ఉపయోగపడుతుంది.
- పాశ్చాత్య తరహా టాయిలెట్ ఉపయోగించండి, లేదా ఒక కుర్చీని సవరించండి.

