Who acquires aphasia?
వాగ్భంధనం ఎవరికి వస్తుంది?
స్ట్రోక్ లేదా వాగ్భంధనం అనేది ఏ వయసు వారికైనా, ఏ జాతి వారికైనా, మగవారికైనా లేదా ఆడవారికైనా, సన్నగా లేదా లావుగా ఉన్నవారికి రావచ్చు. ఇది శాఖా హారులలోను మరియు మాంసాహారులలోను రావచ్చు మరియు వాగ్భంధనంకు దారి తీస్తుంది. ఈ స్ట్రోక్ అనేది బి.పి. (అధిక రక్తపోటు) గల వారికి, కొవ్వు శాతము ఎక్కువగా ఉన్నవారికి, మధుమేహం (షుగర్ ) వ్యాధి ఉన్నవారికి, కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినా, ఎక్కువ శారీరక శ్రమ చేయని వారిలో ఎక్కువగా వస్తుంది.

