Types of Stroke
స్ట్రోక్ (మెదడులో అఘాతం ) లో రకములు:
స్ట్రోక్ అనేది ముఖ్యంగా మూడు రకములు. అవి ఎంబోలిక్, త్రోంబోలిక్, మరియు హెమొర్రేజిక్ (రక్త స్రావం).
Embolic stroke
ఎంబోలిక్ స్ట్రోక్: ఈ స్ట్రోక్ రక్త నాళాలలో ఏదైనా అడ్డు పడినా, లేక మరేవిధమైన కొవ్వు పదార్ధములు అడ్డు పడి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని వలన ఎంబోలిక్ స్ట్రోక్ వస్తుంది.
Thrombotic Stroke
త్రోంబోలిక్ స్ట్రోక్: ఈ విధమైన స్ట్రోక్ లో, ఏదయినా కొంచెం పెద్ద ఫలకం (కొవ్వు నిల్వలు మరియు కొలెస్ట్రాల్ పెరగడం వలన) ధమనిలో రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వలన, మెదడులోని కొన్ని భాగాలకు తగినంత ఆక్సిజెన్ అందదు. దీని వలన ఆ భాగములో కొన్ని కణాలు నశించిపొతాయి. ఇలా ధమనిలో అడ్డుపడిన ఫలకాన్ని త్రోంబస్ అంటారు.
Hemorrhagic Stroke
హెమొర్రేజిక్ స్ట్రోక్ (రక్తస్రావం): ఈ విధమైన స్ట్రోక్ రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరగడం వలన వస్తుంది. ఈ పగుళ్ళు లేదా రక్తస్రావమునకు చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా రక్తపోటు మరియు రక్తనాళము యొక్క సన్నని (అన్యురిజం) భాగములో పగుళ్ళు అతి పెద్ద కారణములు. ఈ అన్యురిజం అనేది రక్తనాళము యొక్క గోడపై బలహీన భాగములో ఒక బుడగలా ఏర్పడుతుంది. ఇవి పుట్టినప్పటినుండి ఉన్నప్పటికి, వీటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇవి చిన్నవిగా ఉన్నప్పుడు వీటి వలన ఏ విధమైన సమస్యలు కనిపించవు.
Thrombotic Stroke ani
Hemorrhagic Stroke ani

