THINGS THAT THE FAMILY SHOULD AVOID DOING
కుటుంబ సభ్యులు చెయకూడని పనులు
- రోగి పరిస్థితి గురించి జాలి పడకండి అలా చేస్తే రోగి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది.
- రోగి మాట్లాడలేదని, ఆయన బదులు మీరు మాట్లాడకూడదు, ఆయన అడిగితే తప్ప మీ అంతట మీరు ఆయన తరపున మాట్లాడవద్దు.
- ఆయన పదాల కోసం వెతుక్కుంటున్నప్పుడు, వెంటనే మీరు ఆ పదాలను అందివ్వకూడదు.
- రోగి శక్తిని మించిన పనులను చేయ్యమనవద్దు.
- సరైన పదం వాడనప్పుడు, అది వాడితీరాలని, వాక్యనిర్మాణం సరిగ్గా ఉండాలని చెప్పవద్దు, దాంతో ఆయన / ఆమె పూర్తిగా విసిగిపోవచ్చు.
- రోగి ఏ విధంగా మాట్లాడటానికి ప్రయత్నించినా (ఉదా: రాయడం, సైగలు చేయడం) మీరు ప్రోతహిం చండి.
- పరిస్థితి పూర్తిగా మారిపోయి కొద్ది రోజుల్లో మామూలుగా అయిపోతారనే ఉత్తి ఆశలు కల్పించకండి.
- రోగిని ఆయన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి దూరంగా పంపించకండి.
- రోగి ఏడ్చినప్పుడు బాధపడనవసరంలేదు, బాధగా ఉన్నప్పుడు ఏడవడం సహజమని గుర్తించాలి.
- ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు రోగి మీద నుండి పూర్తిగా ద్యాస మళ్ళించ వద్దు. మీ మాటల్లో వారిని కలుపుకోవడానికి ప్రయత్నించండి.

