Stroke Risk Factors
స్ట్రోక్ ప్రమాద కారణములు :
వయస్సు, లింగం, మరియు శరీర ఆకృతితో సంబంధం లేకుండా, ఎవరిలోనైన ఈ స్ట్రోక్ రావచ్చు. ఈ స్ట్రోక్ ఎక్కువగా అధిక రక్తపోటు ఉన్నవారిలో, రక్తంలో అధికముగా కొవ్వు ఉన్నవారిలో, మధుమేహం ఉన్నవారిలో, ధూమపానము చేయువారిలో, మరియు కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనను స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి మీ వైద్యుడిని సంప్రదించి ప్రమాద సూచికలకు తగు వైద్యము చేయించుకోవలెను. ఈ ప్రమాద సూచికములు రెండు రకములు: నియంత్రిత మరియు అనియంత్రిత సూచికములు. నియంత్రిత సూచికములను జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పుల వలన మరియు వైద్యము వలన నియంత్రించవచ్చు.
నియంత్రిత ప్రమాద సూచికలు (Controllable Risk Factors):
- అధిక రక్తపోటు
- గుండె జబ్బులు
- మధుమేహం
- అదిక రక్త కొలెస్ట్రాల్
- అథెరోస్క్లెరోసిస్
- శారీరక స్తబ్దత (జీవన శైలి వలన)
- ధూమపానం మరియు మధ్యపానం చేయడం.
అనియంత్రిత ప్రమాద సూచికలు (Uncontrollable Risk Factors):
- వయసు
- లింగం
- జాతి సమూహము
- కుటుంబ చరిత్ర
- ఇది వరకు సంభవించిన స్ట్రోక్.

