Stroke Treatment
స్ట్రోక్ చికిత్స :
స్ట్రోక్ చికిత్సలో కొన్ని అత్యాధునికమైన చికిత్సా విధానములు అందుబాటులో ఉన్నాయి. ఈ స్ట్రోక్ రాకుండా, మరియు వచ్చినప్పుడు కలుగు సమస్యలను సరి చేయుటకు కొన్ని మందులు మరియు శస్త్రచికిత్స పద్దతులు ఉన్నాయి. అయితే ఈ చికిత్సా విధానముల ప్రభావం స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా ఆసుపత్రికి తరలించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతము అందుబాటులో ఉన్న మూడు రకముల చికిత్సలు: 1) కణ ప్లాస్మినొజెన్ యాక్టివేటర్ (ఒక విధమైన మందు), 2) మెర్సి రిట్రీవల్ సిస్టం (ఒక విధమైన పరికరము), 3) పెనుమ్బా సిస్టం (ఒక విధమైన పరికరము).
కణ ప్లాస్మినోజేన్ యాక్టివేటర్ అనేది స్ట్రోక్ వచ్చిన మూడు నుండి ఆరు గంటలలోపు ఇవ్వబడును. దీని వలన రక్తనాళములలో అడ్డు పడిన కొవ్వు పదార్దములు కరిగిపోయి రక్తములో కొట్టుకుపోయి రక్త ప్రసరణ పునరుద్దరించబడుతుంది. మెర్సి రెట్రీవల్ సిస్టం మరియు పెనుమ్బా సిస్టములు గడ్డకట్టిన రక్తము యొక్క భాగమును తొలగించుటకు మరియు రక్త ప్రసరణను మామూలు స్థితికి తెచ్చేందుకు ఉపయోగిస్తారు.

