Aphasia in Multiple Languages
వివిధ భాషల్లో వాగ్భంధనం
వివిధ భాషల్లో మాట్లాడగల్గే వ్యక్తులకు అఫేషియా (వాగ్భంధనం) వచ్చినప్పుడు, వారు అన్ని భాషల్నీ కోల్పోతారు. అయితే, ఏ భాషలో ఏ శక్తిని (మాట్లాడటం, అర్ధంచేసుకోవడం, రాయడం,చదవడం) ఎంతవరకు కోల్పోతారో అనేది ప్రతి భాషలో ఒకే రకంగా ఉండదు. అలాగే, భాషా శక్తిని తిరిగి పొందడంలో కుడా ఒక భాషకీ, ఇంకో భాషకి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఇటువంటి భాషా పరమైన వ్యత్యాసాలకి కొన్ని కారణాలు: రోగి చుట్టూ ఉన్న భాషా వాతావరణం; ఒక భాష వాడుకకి ఉన్న (లేని) అవకాశాలు; రోగికి భాషతో మానసికంగా ఉన్న సంబంధ భాంధవ్యాలు. ఏదైనా, రోగిని తనకి అనుకూలంగా (ఇష్టంగా) ఉన్న ఏ భాష నైనా ఉపయోగించి మాట్లాడమని ప్రోత్సగించడం మంచిది.

