What is Primary Progressive Aphasia (PPA)?
ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫేజియా అంటే ఏమిటి?
ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫేజియా (PPA) అనేది భాషకి సంభందించిన వ్యాధి. దీని కారణంగా భాషని సరిగ్గా ఉపయోగించడం, అర్ధం చేసుకేనే శక్తి క్రమగా క్షీణించి పోవడం జరుగుతుంది. మొదట్లో రోగులు ఒక పని మీద ద్యాస పెట్టడం, విషయాలని గుర్తు పెట్టుకోవడం, తార్కికంగా ఆలోచించడం వంటి మేధా పరమైన వ్యాపకాలలో ఎటువంటి సమస్యలని ఎదుర్కోరు. దైనందిన కాలకృత్యాలలో పాల్గొనే శక్తిని కుడా కోల్పోరు. సాదారణంగా వాడే పదాలని మర్చిపోవడం లేదా వాడలేకపోవడం అనేది ఈ వ్యాధి యొక్క మొట్టమొదటి చిహ్నాలు. ఆ పదాల అర్ధాలు వారికి తెలిసి ఉండకపోవచ్చు. వ్యాధి క్రమంగా ముదిరిపోయినప్పుడు, మేదాపరమైన శక్తులు క్షీణించి, భాషని ఉపయోగించడం కష్టం అవుతుంది. చివరికి అసలు మాట్లడలేకపోవచ్చు కూడా. చాలా వరకు ఈ వ్యాధి 55-65 సంవత్సరాల లోపు వస్తుంది.
ఈ వ్యాధి ఉన్న రోగుల్లో క్రింద పేర్కొన్న లక్షణాలు ఉండవచ్చు:
- మాటలు చాలా నెమ్మదిగా అస్పష్టంగా, మామూలు కంటే తక్కువగా మాట్లాడవచ్చు.
- రోజూ వాడే పదాలనీ, ఇతరుల పేర్లనీ మర్చిపోవడం,
- మాట్లాడడం, మాటలు అర్డంచేసుకొనే శక్తులు క్రమంగా క్షీణీంఛి పోవచ్చు.
- భాషని వ్రాయలేకపోవడం, రాసిన భాషని అర్ధం చేసుకోలేకపోవడం.
- చాలా సులభమైన లెక్కలు చేయలేకపోవడం.
ఈ వ్యాధికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఒకటి లేదు. చాలా సందర్భాలలో ఈ వ్యాధి మెదడుకి సంభందించిన ఇతర వ్యాధులతో అనగా మతిమరుపు, అల్జైమర్స్ లతో కలసి వస్తుంది.

