Aphasia and Stroke Association of India
భారతదేశ అఫేజియా మరియు స్ట్రోక్ అసోసియేషన్
ఉద్యోగ అన్వేషణా సహాయ లేఖ (Letter to Support Job Search)
గౌరవనీయులకు,
భారతదేశ అఫేజియా మరియు స్ట్రోక్ అసోసియేషన్ యొక్క సభ్యునిగా, ఈ స్ట్రోక్ రోగికి లేదా వారి భర్త/ భార్యకు సరైన ఉపాధి కల్పించుటలో మీ సహాయము కొరకు నేను ఈ లేఖను మీకు వ్రాస్తున్నాను.
స్ట్రోక్ అనేది వయసు పైబడిన వారిలో సహజంగా వస్తుంది మరియు దీని వలన అనేక సమస్యలు/లోపాలు కలుగుతాయి. దీని వలన వీరికి మాట్లాడడం, అర్ధం చేసుకోవడం, చదవడం, మరియు వ్రాయడంలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవే కాకుండా వారిలో పక్షవాతం కూడా ఉండవచ్చు. ఈ సమస్యల వలన రోగి యొక్క కుటుంబ ఆర్ధిక స్థితి దెబ్బతింటుంది. అయితే వీరిలో ఆలోచనా సామర్ద్యం లేదా పని చేయు విధానములు ఇతరులలాగానే ఉంటాయి. వీరి సామర్ద్యానికి తగ్గ పనిని ఇచ్చినచో వీరు చాలా బాగా చేయగలరు.
వృద్ధులకు మరియు వికలాంగులకు మనమిచ్చు గౌరవము మరియు సహాయము మన యొక్క నైతిక బలమును మరియు ఆ ప్రాంత సంస్కృతిని తెలుపుతుంది. ఈ స్ట్రోక్ రోగికి సరైన ఉపాధి కల్పించుట కొరకు నేను మిమ్మల్ని ఈ లేఖ ద్వారా కోరుతున్నాను. ప్రత్యామ్నాయంగా, వారి భర్త లేదా భార్యకు ఏదైనా ఉపాధి కల్పించి సహాయము చేయగలరు.
ఈ విషయములో మీ మద్దతు ఈ కుటుంబ గౌరవమును కాపాడుతుంది మరియు వారు తమ సొంత కాళ్ళ మీద నిలబడేలా సహాయపడుతుంది.
శుభాకాంక్షలతో,
భవధీయులు,
సుభాష్. సి. భట్నాగర్, Ph.D. CCC-SLP
subhash.bhatnagar@mu.edu

