Transient Ischemic Attack
స్వల్పకాల ఇస్కీమిక్ ఎటాక్ :
రక్తనాళములో ఏదైనా కొవ్వు పదార్దము లేదా ధమను ఫలకము స్వల్ప సమయము మాత్రమే అడ్డుపడినప్పుడు వచ్చు స్ట్రోక్ ను స్వల్పకాల ఇస్కీమిక్ ఎటాక్ అంటారు. దీని వలన వచ్చు సమస్యలు కేవలం కొంత సమయము మాత్రమే ఉంటాయి. దీని వలన వచ్చు కొన్ని సమస్యలు తిమ్మిరి, మాట్లాడలేకపోవడము, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం, మరియు దృశ్య సమస్యలు. ఈ సమస్యలు సాధారణముగా 10-15 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ముందు ముందు పెద్ద స్ట్రోక్ వచ్చుటకు ఈ రకమైన స్ట్రోక్ ఒక విధమైన హెచ్చరిక గుర్తు. ఈ రకమైన స్ట్రోక్ వచ్చిన వారిలో 40% నుండి 50% మందిలో ఆరు నేలల్లోపు పెద్ద స్ట్రోక్ వచ్చును. దీనికి సరైన సమయంలో వైద్యము అందించుట వలన భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు.

