Swallowing treatment:
డిస్ఫేజియా చికిత్స:
డిస్ఫేజియా చికిత్సలో ముఖ్యమైనవి:
- -- రోగికి మరియు వారి సంబందించిన వారికి డిస్ఫేజియా చికిత్సా విధానముల గురించి తెలియచేయడం.
- -- వేరే వేరే రకముల చికిత్సా విధానములు అనగా, నోటి భాగముల కదలికలు, మ్రింగుటకు అవసరమైన పొజిషన్లు గురించి తెలియచేయడం.
- -- అవసరమైనప్పుడు ఆహారములో తగిన మార్పులు (అనగా ఆహార పదార్దములు, పరిమాణము) చేయడం.
- -- ఎవరికైనా ఎక్కువగా సమస్య ఉన్నచో, వారికి నేసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఆహారము అందిచవచ్చు.
నేసోగాస్ట్రిక్ ట్యూబ్ను ముక్కుద్వారా పొట్టలోకి పంపిస్తారు. ఇది కేవలం తాత్కాలిక చికిత్స మాత్రమే. ఒక వేళ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నచో, గాస్ట్రొటోమీ ట్యూబ్ ఉపయోగిస్తారు. దీనిని డైరెక్ట్ గా పొట్టలోనికి పంపించి అవసరమైన పోషక పదార్దములను అందిస్తారు). రోగియొక్క స్థితి సరైనప్పుడు దీనిని తేలికగా తీసివేయవచ్చు.

