Importance of early treatment
మొదటి చికిత్స యొక్క ప్రాముఖ్యత:
స్ట్రోక్ వచ్చిన వెంటనే అన్ని కణాలు నశించిపోవు. ఆక్సిజెన్ అందని ముఖ్య భాగములో మాత్రమే కణములు నశించుకుపోతాయి. ఈ ముఖ్య భాగము చుట్టూ కొన్ని నిశ్శబ్ధ కణములు ఉంటాయి. ఇవి ఏ విధమైన ఆక్సిజెన్ లేకపోయినను 20 నిముషములు పని చేస్తాయి. కొంచెము ప్రసరణ ఉన్నచో ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఇవి పని చేస్తాయి. స్ట్రోక్ తర్వాత కొంత సమయములో చికిత్స చేసినచో, ఆ మనిషి మరలా మామూలు స్థితికి చేరుకొనుటకు ఉపయోగపడుతుంది. అందువలన స్ట్రోక్ వచ్చిన వారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళి సరైన చికిత్స అందించవలెను.

